లక్నో: పార్క్ చేసిన కారు టాప్‌పై ఒక కోతి (Monkey Smashing Jump ) జంప్ చేసింది. అయితే ఆ కారు సన్‌రూఫ్ పగిలింది. కారులో పడిన కోతిని వెంటనే బయటకు దూకింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 19న మధ్యాహ్నం వేళ విషేశ్వరగంజ్ ప్రాంతంలో ఒక కారు పార్క్ చేసి ఉంది. అయితే ఒక కోతి ఆ కారు టాప్‌పైకి జంప్ చేసింది. అయితే ఆ కారు సన్‌రూఫ్ పగిలిపోయింది. దీంతో కారు లోపల ఆ కోతి పడింది. అయితే వెంటనే బయటకు జంప్ చేసింది. అక్కడి నుంచి పారిపోయింది.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆ కోతికి ఏమైనా గాయమైందా? అని కొందరు ప్రశ్నించారు. అయితే కారుకు జరిగిన నష్టంపై మరికొందరు ఆరా తీశారు. ఆ కారు యజమాని ఈ నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి ఎలా వివరిస్తాడు? అని ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. అందుకే కారు కొనకూడదని నిర్ణయించుకున్నట్లు మరొకరు చమత్కరించారు.
ले बे ये गया तेरा सन रूफ 😭😭 pic.twitter.com/n82LOoJKO4
— Raja Babu (@GaurangBhardwa1) November 19, 2024