న్యూఢిల్లీ: భోజనం చేస్తున్న వ్యక్తి వద్దకు ఒక కోతి వచ్చింది. అతడి ప్లేట్లోని ఫుడ్‌ను అది తిన్నది. అయితే ఆ వ్యక్తి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఎలాంటి భయం లేకుండా తన ప్లేట్లోని ఆహారాన్ని ఆ కోతిని తిననిచ్చాడు. పైగా దానిని తరిమే ప్రయత్నాన్ని నివారించాడు. (Monkey Eats From Man’s Food Plate) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక ఆలయంలో భక్తులకు భోజనం పెట్టారు. పలువురు వ్యక్తులు అక్కడి నేలపై కూర్చొన్నారు. ప్లేట్లలో వడ్డించిన ఆహారాన్ని తిన్నారు.
కాగా, అక్కడ ఆహారం తింటున్న వృద్ధుడి వద్దకు ఒక కోతి వచ్చింది. అతడు తినే ప్లేట్లోని ఆహారాన్ని అది తినసాగింది. ఆ వ్యక్తి కూడా కోతిని ఏమీ అనలేదు. పైగా అతడి ప్లేట్లోని ఫుడ్‌ను తినేందుకు అనుమతించాడు. అలాగే ఆ కోతిని తరిమేందుకు సిబ్బంది ప్రయత్నించడాన్ని నివారించాడు. అక్కడున్న కొందరు ఇది చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో అన్నది తెలియలేదు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్లేట్లోని ఆహారాన్ని కోతి తినడంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని ఆ వ్యక్తి తీరు పట్ల నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. హనుమంతుడే స్వయంగా అతడి ప్లేట్ నుంచి ఆహారం తిన్నట్లుగా ఒకరు పేర్కొన్నారు.