డెహ్రాడూన్: బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర ఎమ్మెల్యే మధ్య నెలకొన్న విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఒకరి కార్యాలయంపై మరొకరు రాళ్లు రువ్వడంతోపాటు కాల్పులు జరుపుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్ ఆదివారం తుపాకులు చేతపట్టి తన అనుచరులతో కలిసి ఖాన్పూర్ స్వతంత్ర ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కున్వర్, ఆయన అనుచరులు అక్కడ హంగామా చేశారు. ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ కార్యాలయంపై కాల్పులు జరుపడంతోపాటు రాళ్లు రువ్వి దుర్భాషలాడారు.
కాగా, ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ కూడా ధీటుగా స్పందించారు. తన అనుచరులతో కలిసి కున్వర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ రాళ్లు రువ్వడంతోపాటు పిస్టల్‌తో కాల్పులు జరిపి దూషించారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.
మరోవైపు ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ శనివారం రాత్రి లంధౌరాలోని తన భవనంపై దాడి చేశాడని, తనను దుర్భాషలాడినట్లు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్ ఆరోపించారు. దీనిపై స్పందించిన తనను పోలీసులు అరెస్ట్ చేశారని, ఇది అన్యాయమని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా తాను పోరాడతానని అన్నారు.
కాగా, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ మధ్య చాలా కాలంగా విరోధం నెలకొన్నది. దీంతో ఒకరిపై మరొకరు ఆరోపించుకోవడంతోపాటు సోషల్ మీడియాలో విమర్శించుకోవడం ఈ ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో వారిద్దరి వద్ద ఉన్న పిస్టల్స్ లైసెన్స్ రద్దు కోసం జిల్లా మేజిస్ట్రేట్‌కు సిఫార్సు చేస్తామని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు వీరి మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
शूटआउट एट हरिद्वार…
फ़िल्मी नहीं,सब ओरिजिनल है।
बस व्यवस्था का लुत्फ़ उठाइये….#Uttarakhand pic.twitter.com/HfyRX5ZEFW— ꜱʜɪᴠ ᴮᴴᵁ (@ShivBHU) January 26, 2025
In a shocking incident, a firing and vandalism attack was reported at the office of #Khanpur MLA #UmeshKumar in #Roorkee, #Uttarakhand.
Allegedly, former MLA #KunwarPranavSinghChampion, along with his supporters, arrived at the office and fired multiple rounds.
A video of the… pic.twitter.com/AXhy8REqIf
— Hate Detector 🔍 (@HateDetectors) January 26, 2025