Loksabha Elections 2024 | కుల గణన చేపడతామని మోదీ గ్యారంటీ ఇవ్వగలరా..? : ప్రధానికి స్టాలిన్ సవాల్
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే కులగణన చేపట్టడంతో పాటు, ఎన్నికల బాండ్ల వ్యవహారంపై దర్యాప్తు, చైనా ఆక్రమించిన భూభాగాల స్వాధీనంపై గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సవాల్ విసిరారు.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే కులగణన చేపట్టడంతో పాటు, ఎన్నికల బాండ్ల వ్యవహారంపై దర్యాప్తు, చైనా ఆక్రమించిన భూభాగాల స్వాధీనంపై గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సవాల్ విసిరారు. సీఏఏకు చేసిన సవరణలను వెనక్కితీసుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల నిధులను తక్షణమే విడుదల చేయాలని కూడా ప్రధానిని స్టాలిన్ డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రచారంలో తరచూ మోదీ గ్యారంటీ అంటూ బీజేపీ ఊదరగొడుతుండటంపై స్టాలిన్ స్పందిస్తూ ఈ ప్రశ్నలు సంధించారు. లోక్సభ ఎన్నికల నేపధ్యంలో తమిళనాడులో ప్రధాని మోదీ విస్తృత పర్యటనలపై కూడా స్టాలిన్ విస్మయం వ్యక్తం చేశారు. వలస పక్షుల మాదిరిగా ఎన్నికల సీజన్లో ప్రధాని తమిళనాడు చుట్టూ తిరుగుతున్నారని, గ్యారంటీ కార్డుతో వస్తున్న ప్రధాని మోదీ ఈ గ్యారంటీలను ఇవ్వగలరా అని ఎక్స్ వేదికగా స్టాలిన్ నిలదీశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు, ఏటా రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలపై కూడా ప్రధాని హామీ ఇవ్వాలని మోదీ గ్యారంటీల జాబితాలో పొందుపరచాలని స్టాలిన్ కోరారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, గిట్టబాటు ధరపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కూడా మోదీని స్టాలిన్ డిమాండ్ చేశారు. సైన్యంలో అగ్నిపథ్ పధకాన్ని రద్దు చేయాలని కోరారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

