న్యూఢిల్లీ, మే 20: కొవాగ్జిన్తోనూ దుష్ప్రభావాలు ఉన్నాయన్న బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) అధ్యయనంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ భల్ స్పందించారు. బీహెచ్‌యూ నివేదిక తప్పుల తడక అని అధ్యయనాన్ని కొట్టిపారేశారు. స్టడీ కోసం వాడిన మెథడాలజీ, డిజైన్ తప్పు అని తెలిపారు.
స్ప్రింగర్ నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక తప్పుదోవ పట్టించేలా ఉన్నదని వెల్లడించారు. కొవాగ్జిన్ వేసుకొన్నవారికి, వేసుకోనివారి మధ్య తేడాను ఆ అధ్యయనం తేల్చలేకపోయిందని విమర్శించారు. ఆ అధ్యయనాన్ని తొలగించాలని ఈ మేరకు సదరు జర్నల్ ఎడిటర్‌కు లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు.