లక్నో: కొందరు వ్యక్తులు గుడి పూజారిని (Temple Priest) కొట్టి ఆయనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. కాళ్లు, చేతులు పట్టుకుని ఆలయం బయటకు తీసుకెళ్లారు. కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా జనం అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం వికాస్ నగర్ సెక్టార్ 9లోని మహాదేవ్ హనుమాన్ ఆలయంలోకి కొందరు వ్యక్తులు ప్రవేశించారు. పూజారి రామ్సేన్హీ దాస్‌పై భౌతికంగా దాడి చేశారు. ఆయన కాళ్లు, చేతులు పట్టుకుని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. గుడి బయట పార్క్ చేసిన కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే జనం గుమిగూడటంతో ఆ వ్యక్తులు పూజారిని వదిలి అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. ఆ గుడికి సంరక్షకుడిగా ఉన్న పూజారి రామ్సేన్హీ దాస్ ఆలయ ప్రాంగణంలో గోడ నిర్మిస్తున్నట్లు తెలిపారు. స్థానికులు దీనిని వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొన్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उक्त बाबा जो मंदिर की देखरेख करते है, उनके द्वारा मंदिर में निर्माण कार्य कराया जा रहा था, जिसका वहाँ के लोगों द्वारा विरोध किया गया व मारपीट की गई, जिसके संबधं में थाना विकासनगर द्वारा आवश्यक वैधानिक कार्वयाही की जा रही है।
— LUCKNOW POLICE (@lkopolice) October 20, 2023