
చెన్నై : ఆ యువరాణి, ఆమె బిడ్డ ఇద్దరూ మృత్యుంజయులే. వేగంగా రైలు దూసుకొచ్చినప్పటికీ.. తన బిడ్డను ప్రాణాలతో కాపాడుకునేందుకు చాకచక్యంగా పట్టాల మధ్యలో పడుకుంది. తల్లీబిడ్డను గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై రైలును ఆపేశారు.
తమిళనాడులోని కాట్పాడి రైల్వే జంక్షన్లో 37 ఏండ్ల యువరాణి, తన 9 నెలల బిడ్డతో రైలు పట్టాలు దాటేందుకు యత్నించింది. ఈ క్రమంలో ఆమె కాలు స్లిప్ కావడంతో పట్టాలపై పడిపోయింది. అంతలోనే ఎర్నాకులం ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ వద్దకు దూసుకొచ్చింది.
అయితే అప్రమత్తమైన తల్లి యువరాణి, తన బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు తెలివిగా పట్టాల మధ్యలో అలానే ఉండిపోయింది. రైల్వే సిబ్బంది ఎర్నాకులం ఎక్స్ప్రెస్ను సడెన్గా ఆపేశారు. యువరాణి, ఆమె బిడ్డను పట్టాల మధ్యలో నుంచి సిబ్బంది బయటకు తీశారు. తల్లి తలకు స్వల్ప గాయాలు కాగా, బిడ్డకు ఎలాంటి హానీ జరగలేదు. అనంతరం తల్లీబిడ్డను చికిత్స నిమిత్తం వేలూరు ఆస్పత్రికి తరలించారు పోలీసులు.