జిరక్పూర్: మొహాలీలో 16 ఏళ్ల అమ్మాయి(Minor Girl)ని రేప్ చేశారు. కదులుతున్న కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. జూలై 23వ తేదీన ఈ ఘటన జరిగింది. చండీఘడ్-అంబాలా జాతీయ రహదారి సమీపంలోని వీఐపీ రోడ్డు మెట్రో మాల్ దగ్గర ఈ ఘటన రాత్రి 8 గంటలకు జరిగింది. సెలూన్లో పనిపూర్తి చేసుకుని ఆటోరిక్షా కోసం రోడ్డుపై ఎదురుచూస్తున్న సమయంలో కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ అమ్మాయిని బలవంతంగా కారులోకి లాగేశారు.
కారు ప్రయాణిస్తున్న సమయంలో ఆమెపై దాడి చేశౄరు. ఆ తర్వాత నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆమెపై లైంగికంగా దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో బాధితురాలి సోదరుడి పేరును నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. నేరానికి పాల్పడిన తర్వాత మళ్లీ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లిన లొకేషన్లో వదిలేశారు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జిరక్పూర్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి విచారణ మొదలుపెట్టారు.