లక్నో: కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. (girl gang raped) ఆమె స్నేహితురాలిని కారు నుంచి తోసివేయడంతో మరణించింది. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ఆ కారును అడ్డుకున్నారు. కాల్పులు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 6న సాయంత్రం వేళ నోయిడాకు చెందిన ఇద్దరు యువతులను ముగ్గురు వ్యక్తులు కారులో ఎక్కించుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి లక్నోకు కారులో బయలుదేరారు.
కాగా, ఆ వ్యక్తులు మార్గమధ్యలో మద్యం కొనుగోలు చేసి కారులో సేవించారు. కదులుతున్న కారులో యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఒక యువతి ప్రతిఘటించడంతో కదుతులున్న కారు నుంచి బయటకు తోసేశారు. దీంతో మీరట్ జిల్లాలోని ప్రాంతంలో రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మరణించింది.
మరోవైపు కదులుతున్న కారులో మరో యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఖుర్జా ప్రాంతంలో ఆమె తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వెంటనే స్పందించారు. అలీగఢ్-బులంద్‌షహర్ హైవేపై కారును అడ్డుకున్నారు. అందులో ఉన్న వ్యక్తులు కాల్పులకు ప్రయత్నించగా పోలీసులు ప్రతికాల్పులు జరిపారు.
కాగా, ఎన్కౌంటర్లో కాళ్లకు గాయమైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నోయిడాకు చెందిన సందీప్, అమిత్, ఘజియాబాద్‌కు చెందిన గౌరవ్గా వారిని గుర్తించారు. రెండు పిస్టళ్లు, లైవ్, ఖాళీ కార్ట్రిడ్జ్‌లతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.