ముంబై: ఆగి ఉన్న బస్సును మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఆ వాహనంలోని 9 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. (minivan rams into bus) మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో పూణే-నాసిక్ హైవేపై నారాయణగావ్ వైపు వెళ్తున్న మినీ వ్యాన్ను టెంపో ఢీకొట్టింది. దీంతో మినీ వ్యాన్ అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఖాళీ బస్సును అది బలంగా ఢీకొట్టింది.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మినీ వ్యాన్లో ప్రయాణించిన 9 మంది ఈ ప్రమాదంలో మరణించినట్లు తెలిపారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.