న్యూఢిల్లీ: రోడ్లు, రహదారులపై ఉండే గుంతల వల్ల ప్రతి రోజు దేశవ్యాప్తంగా చాలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే కేంద్ర రోడ్డు, రవాణా, రహదారులు శాఖ దీనికి సంబంధించిన డేటాను రిలీజ్ చేసింది. రోడ్లపై ఉండే గుంతల వల్ల 2019లో సుమారు 4775 ప్రమాదాలు జరిగినట్లు కేంద్ర శాఖ వెల్లడించింది. ఇక 2020లోనూ ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆ ఏడాదిలో 3564 యాక్సిడెంట్లు జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.