Nehur Letters Row : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అధికార పక్షం, విపక్ష కాంగ్రెస్ మధ్య వాడీవేడీగా సాగుతున్నాయి. సర్‌పై చర్చ నుంచి.. మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై దుమారం రేగింది. ఆపై దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru)కు సంబంధించిన లేఖలపై బుధవారం లోక్ సభలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాదోపవాదనలు గట్టిగానే జరిగాయి. ఈ సందర్భంగానే నెహ్రూ లేఖలు తిరిగిచ్చేయాలని, అవేమీ గాంధీ కుటుంబం ఆస్తులు కావని సంస్కృతిక శాఖ సోనియా గాంధీ (Sonia Gandhi)కి స్పష్టం చేసింది.
భారత మొదటి ప్రధాని నెహ్రూకు సంబంధించిన లేఖలు ఎక్కడ? మాజీ ప్రధాని లేఖలు గల్లంతు చేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని అని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దాంతో.. సంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ నెహ్రూకు చెందిన లేఖలు అదృశ్యం కాలేదని చెప్పారు. ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం, లైబ్రరీ (PMML) నుంచి నెహ్రూ లేఖలు గల్లంతవ్వలేదు. 2008 ఆగస్టు 29 తేదీతో కూడిన ఉత్తరంలో సోనియా గాంధీ ప్రతినిధి ఎంవీ రాజన్ నెహ్రుకు సంబంధించిన వ్యక్తిగత ఉత్తరాలను, నోట్స్‌ను సోనియా తిరిగి తీసుకునేందుకు అనుమతించాలని కోరారు.
नेहरू पेपर्स PMML से “लापता” नहीं हैं।
लापता” होने का अर्थ मौजूदगी का स्थान अज्ञात होना है, इस विषय में तो ज्ञात है कि पेपर्स कहाँ और किसके अधिकार में हैं।
जवाहरलाल नेहरू जी से जुड़े कागज़ात वाले 51 बक्सों को गांधी परिवार ने 2008 में PMML (तत्कालीन NMML) से वापस ले लिया था।…
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) December 17, 2025
ఈ లేఖను బట్టే.. నెహ్రూ వ్యక్తిగత పత్రికల్లో ముద్రితమైన 51 కార్టూన్లను 2008లో సోనియా గాంధీకి అప్పగించారు. దాంతో.. ఆ కార్టూన్లు, లేఖలను సోనియా ఆఫీస్ నుంచి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పీఎంఎంఎల్ నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంది. ఈ విషయమై 2025 జనవరి 28న, 2025 జూలై 3న కాంగ్రెస్ అధినేత్రికు లేఖలు రాశాం. కాబట్టి.. ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం, లైబ్రరీ నుంచి నెహ్రూ లేఖలు అదృశ్యం కాలేదు. అవి ఎవరి దగ్గర ఉన్నాయో మాకు తెలుసు అని సభకు విన్నవించారు షెకావత్. అనంతరం.. సోనియాను నెహ్రూ లేఖలు తిరిగి అప్పగించాలని ఆయన కోరారు.
साल 2008 में नेहरू पेपर्स को पीएमएमएल से बाहर ले जाया गया, तब कांग्रेस की सरकार थी, यह बताने की जरूरत नहीं कि उस समय देश को कैसे और किस तरह चलाया जा रहा था, तो ये पेपर्स श्रीमती सोनिया गांधी के अधिकार में चले जाना कौन सी बड़ी बात थी?
जयराम रमेश जी को पता होना चाहिए! पता नहीं… https://t.co/3ZO8mvUWXI
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) December 17, 2025
‘నెహ్రూ లేఖలు, కార్టూన్లను ఎందుకు తిరిగి ఇవ్వడం లేదో దేశ ప్రజలకు చెప్పాలని సోనియా గాంధీని అడుగుతున్నాను. వాటిని ఎందుకు మీ వద్దే ఉంచుకున్నారు? అందులో ఏం రహస్యాలు ఉన్నాయి?.. దేశ ఆస్తిగా పరిగణించే ఆ ఉత్తరాలను సమర్పించకపోవడంపై సోనియా ఇచ్చిన వివరణ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ఎంతో ముఖ్యమైన చారిత్రక డాక్యుమెంట్లు ఇంకా ప్రజలకు ఎందుకు అందుబాటులో లేవు? అవేమీ మీ కుటుంబ వ్యక్తిగత పత్రికలు కావు’ అని మంత్రి ఎక్స్ వేదికగా సోనియాను అభ్యర్థిస్తూనే సుతిమెత్తగా హెచ్చరించారు కూడా.