Nagpur Raj Bhavan | మహారాష్ట్ర రెండో రాజధాని నాగ్‌పూర్‌లో 33 ఏండ్ల తర్వాత ఆదివారం తొలిసారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. 1991లో అప్పటి సీఎం సుధాకర్ రావు నాయక్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. శివసేన నుంచి తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన చగన్ భుజ్ బల్, రాజేంద్ర గోలెలకు తన క్యాబినెట్ లో చోటు కల్పించారు సుధాకర్ రావు నాయక్. బీడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జైదత్ కృషి సాగర్ ను కూడా సుధాకర్ రావు నాయక్ తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. 1991 జూన్ 25 నుంచి 1993 పిబ్రవరి 22 వరకూ సుధాకర్ రావు నాయక్ సీఎంగా ఉన్నారు. అప్పట్లో చగన్ భుజ్‌బల్, రాజేంద్ర గోలె సారధ్యంలో 12 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యారు. కానీ, 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చగన్ భుజ్‌బల్, రాజేంద్ర గోలె ఓటమి పాలయ్యారు. తాజాగా ఆదివారం జరిగిన దేవేంద్ర ఫడ్నవీస్ క్యాబినెట్ విస్తరణలో 39 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గత ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న చగన్ భుజ్‌బల్‌ను ఫడ్నవీస్ తప్పించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.