దేశంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. ముఖ్యంగా ఇక్కడ ఒమిక్రాన్ కేసులు కూడా బాగా వెలుగు చూశాయి. ఇప్పటికీ బెంగళూరు వంటి ప్రాంతాల్లో ప్రతిరోజూ వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సాక్షాత్తు ఆ రాష్ట్ర మంత్రే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ కెమెరాకు చిక్కారు. ఇదేంటని ప్రశ్నిస్తే వింత సమాధానం చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెళగావి ప్రాంతంలో అటవీశాఖ అధికారులు ఒక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిధిగా కర్ణాటక అటవీశాఖ మంత్రి ఉమేష్ వి. కత్తి హాజరయ్యారు.
మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాస్కు లేకుండా పాల్గొన్నారు. ఇదేంటని విలేకరులు ఆయన్ను ప్రశ్నిస్తే.. మాస్కు తప్పనిసరిగా చెప్పాలని మోదీ కూడా చెప్పలేదుగా అంటూ బదులిచ్చారు. ‘‘దేన్నీ తప్పనిసరి చేయబోనని మోదీనే స్పష్టం చేశారు.
మాస్కు ధరించడం అనేది వ్యక్తిగత బాధ్యత అన్నారాయన. అంటే అది నా ఇష్టానికి వదిలేశారన్నమాట. సో, నాకు పెట్టుకోవాలనిపించలేదు. అందుకే మాస్కు పెట్టుకోలేదు’’ అని ఉమేష్ సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
#Karnataka Min @UMESH_V_KATTI
— Imran Khan (@KeypadGuerilla) January 18, 2022
Says he doesn't feel like wearing #Mask.#Karnataka
"Yest,PM himself said.I will not make it mandatory.Individuals have to take responsibility and wear mask. In that way, it is left upto me too. I didn't feel like wearing it.Hence,I am not wearing it" pic.twitter.com/ElImdVB6VO