ఒకరు ఢిల్లీకి గులాం.. మరొకరు గుజరాత్‌కు గులాం : మంత్రి కేటీఆర్
Minister KTR | తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకరు ఢిల్లీకి గులాం అయితే.. మరొకరు గుజరాత్‌కు గులాం అని కేటీఆర్ విమర్శించారు. మేం

హైదరాబాద్ : తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకరు ఢిల్లీకి గులాం అయితే.. మరొకరు గుజరాత్‌కు గులాం అని కేటీఆర్ విమర్శించారు. మేం ఢిల్లీ, గుజరాత్‌లకు గులాములం కాదు.. మీ ఉడుత ఊపులకు భయపడేది లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు. మీరేం పీకారని ఉద్యమకారులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి రావాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏమైనా అంటే సీబీఐ, ఈడీ అని భయపెట్టిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. మోదీకి, సోనియా గాంధీకి భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
కరీంనగర్ జిల్లాకు చెందిన చల్మెడ లక్ష్మీనరసింహారావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో లక్ష్మీనరసింహారావుకు కేటీఆర్ గులాబీ జెండా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీతో రెండున్నర దశాబ్దాల అనుబంధాన్ని వదులుకొని లక్ష్మీనరసింహారావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. లక్ష్మీనరసింహారావు దాదాపుగా ఒక దశాబ్దన్నర కాలం నుంచి తెలుసు. ముక్కుసూటి వ్యక్తిత్వం గల మనిషి. 2006లో కరీంనగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ గెలువబోతున్నారని ఆయన తనతో చెప్పారు. లక్ష్మీనరసింహారావు చేరికతో పూర్వ కరీంనగర్ జిల్లాలో పార్టీకి కొత్త శక్తి వస్తుందని కేటీఆర్ తెలిపారు.
బండి సంజయ్ పశువా.. మనిషా..
యాసంగిలో పండించే వరి ధాన్యం సేకరణపై తేల్చండి అని టీఆర్ఎస్ ఎంపీలు వారం రోజులు అడిగితే స్పందన లేదు. ఒక బీజేపీ ఎంపీ మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ బియ్యం స్మగ్లర్లు అని అంటుండు. వాడు మనిషా.. పశువా.. వాన్ని ఏమనాలో అర్థం కాదు. బియ్యం స్మగ్లర్లా.. ఏమైనా తెలివుందా? ఏమైనా మెదడు మోకాళ్లలకు జారిందా? అని అడిగారు. లేక ఏమన్నా నెత్తి మొత్తం కరాబ్ అయిందా? అని అడిగారు. దున్నపోతుమీద వాన పడ్డట్టు వ్యవహరిస్తుండ్రు. బండి సంజయ్ తొండి సంజయ్ లా మారారు
పీసీసీ చీఫ్ ఓ చిల్లరగాడు..
కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన పీసీసీ చీఫ్ కాదు.. చిల్లరగాడు అని ధ్వజమెత్తారు. రూ. 50 కోట్లు లంచమిచ్చి పీసీసీ తెచుకున్నాడని కోమటి రెడ్డే ఆరోపించాడు. సచివాలయంలో నేల మాళిగలు ఉన్నాయని పిచ్చోడిలా మాట్లాడిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు అని కోపోద్రిక్తులయ్యారు. ఒకడు బియ్యంలో రూ. 3 వేల కోట్ల స్కాం అంటాడు. మరొకడు వ్యాక్సిన్లలో రూ. 10 వేల కోట్ల స్కాం అంటాడు. ఏదీ పడితే మాట్లాడే వాడికి నెత్తి లేదు కత్తి లేదు
ఉడుత ఊపులకు భయపడేది లేదు..
బీజేపీ తెలంగాణకు ఏం పీకిందని ఉద్యమ కారులు ఆ పార్టీ లో చేరతారు అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ ఉడత ఊపులకు భయపడే వారు ఎవ్వరూ లేరు. అరెస్టులు చేస్తామని బెదిరిస్తే భయపడే వారు ఎవ్వరూ లేరు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. మేం ఎవ్వరికీ బానిసలం కాదు. తెలంగాణకే బానిసలం. సోనియా గాంధీ, మోదీకి భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు.
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRTRS సమక్షంలో వందలాది మంది అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీ చల్మెడ లక్ష్మీ నరసింహారావు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ శ్రీ కె. కేశవ రావు. pic.twitter.com/5ECNvDWJrO
— BRS Party (@BRSparty) December 8, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

