(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): స్విట్జర్లాండ్లోని పచ్చిక బయళ్ల మాదిరిగా ప్రకృతి అందాలతో కనుల విందు చేసే ఆకర్షణీయమైన గడ్డి మైదానాలు, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలు పహల్గాంలోని బైసరాన్లో ఉంటాయి. అందుకే దీన్ని ‘మినీ స్విట్జర్లాండ్’గా కూడా పిలుస్తారు. ఏటా దాదాపు 12 లక్షల మంది యాత్రికులు ఈ ప్రాంతాన్ని పర్యటిస్తారని గణాంకాలు చెప్తున్నాయి. ఈ పర్యాటక ప్రాంతానికి గుర్రాలు, కాలినడకన మాత్రమే చేరుకోగలరు.