న్యూఢిల్లీ, నవంబర్ 26: డివైజ్‌ల్లోని గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్(జీపీయూ)లో ఒక బగ్ కారణంగా లక్షలాది స్మార్ట్ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉన్నదని గూగుల్‌కు చెందిన ప్రాజెక్టు జీరో టీమ్ హెచ్చరించింది. ఈ బగ్ గురించి సాంకేతిక బృందం బ్రిటన్‌కు చెందిన చిప్ డిజైనర్ కంపెనీ ఏఆర్ఎంను అప్రమత్తం చేయగా.. కంపెనీ ఈ సమస్యను పరిష్కరించింది. ఈ ఏడాది జూన్, జూలై మధ్యలో గుర్తించిన ఐదు సమస్యలను గూగుల్ పరిశోధకులు ఏఆర్ఎంకు నివేదించారు. శామ్సంగ్, షియోమీ, ఒప్పో, గూగుల్‌తో సహా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఇటీవలి వరకు ఇటువంటి సాంకేతికపరమైన లోపాలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని ప్రాజెక్టు జీరో టీమ్ పేర్కొన్నది.