Raghav Chadha | 10 లక్షల ఫాలోవర్లు ఔట్..పార్టీ మారిన చద్దాకు జెన్‌జీ షాక్
ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరి దేశ రాజధానిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన రాఘవ్ చద్దా ప్రజాదరణ దెబ్బ తిన్నట్లు కనిపిస్తోంది. కొన్ని వారాల క్రితం ఆప్ రాజ్యసభ ఉపనాయకుడి పదవిని కోల్పోయిన చద్దా బీజేపీలో చేరతారని విస్తృతంగా ఊహించినప్పటికీ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం జెన్‌జీకి నచ్చినట్లు కనిపించడం లేదు. నేటి డిజిటల్ యుగంలో ఒకరి ప్రజాదరణను అంచనా వేయడానికి సోషల్ మీడియా ఫాలోవర్లను ఒక కొలమానంగా చూస్తారు
- పార్టీ మారిన చద్దాకు జెన్‌జీ షాక్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరి దేశ రాజధానిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన రాఘవ్ చద్దా ప్రజాదరణ దెబ్బ తిన్నట్లు కనిపిస్తోంది. కొన్ని వారాల క్రితం ఆప్ రాజ్యసభ ఉపనాయకుడి పదవిని కోల్పోయిన చద్దా బీజేపీలో చేరతారని విస్తృతంగా ఊహించినప్పటికీ ఆయన తీసుకున్న ఈ నిర్ణయం జెన్‌జీకి నచ్చినట్లు కనిపించడం లేదు. నేటి డిజిటల్ యుగంలో ఒకరి ప్రజాదరణను అంచనా వేయడానికి సోషల్ మీడియా ఫాలోవర్లను ఒక కొలమానంగా చూస్తారు. బీజేపీలోకి అనూహ్యంగా మారిన తర్వాత చద్దా 24 గంటల్లోపే ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయారని గణాంకాలు చూపిస్తున్నాయి. చద్దాపై వ్యతిరేకతకు యువత ముఖ్యంగా జెన్‌జీనే కారణమని రాజకీయ విశ్లేషకులు సూచించారు. డేటా ఆధారిత రాజకీయ నాయకుడైన చద్దా ఆ డేటాను విశ్లేషించి పరిస్థితిని చక్కదిద్దుకోగలరా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి!
కేజ్రీవాల్ విధానాల వల్లే రాజీనామా: చద్దా
కేజ్రీవాల్ విధానాల కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీని వీడాల్సి వచ్చిందని ఎంపీ రాఘవ చద్దా పేర్కొన్నారు. మరో ఆరుగురు ఎంపీలు కూడా ఇదే కారణంతో పార్టీని వీడినట్టు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. శీష్ మహల్ కారణంగా ఆప్ ప్రతిష్ట దెబ్బ తిందని పేర్కొన్నారు. దీంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకుందని తెలిపారు.
కేజ్రీవాల్ వెళ్లిపోయిన కొన్ని గంటలకే అశోక్ మిట్టల్ ఫిరాయింపు ఒకప్పుడు ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు విధేయత చూపిన నాయకులే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకులతో చేతులు కలిపారు. దీంతో బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుందనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి బీటలు వారుతున్నాయి. ఢిల్లీ మద్యం కేసు కారణంగా కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసినప్పుడు ఆయనను తన నివాసంలో ఉండమని ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ ఆహ్వానించారు. కేంద్రం కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని లోధి ఎస్టేట్‌లో టైప్-7 ప్రభుత్వ బంగ్లాలో కేటాయించడంతో శుక్రవారం ఆయన అందులోకి మారారు. కాగా, కేజ్రీవాల్ తన నివాసాన్ని వీడిన కొద్ది అశోక్ మిట్టల్ ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలోకి వెళుతున్నట్టు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

