ఇంపాల్: మణిపూర్(Manipur) సీఎం ఎన్ బీరేన్ సింగ్ సెక్యూర్టీ కాన్వాయ్‌పై అనుమానిత మిలిటెంట్లు దాడి చేశారు. కంగ్పోక్పి జిల్లాలో ఇవాళ ఉదయం ఈ అటాక్ జరిగింది. ఆ దాడిలో ఒకరు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల హింస చోటుచేసుకున్న జిరిబమ్ జిల్లాకు కాన్వాయ్ వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. సెక్యూర్టీ దళాలపై మిలిటెంట్లు పలుమార్లు ఫైరింగ్ జరిపారు. అయితే ఆ దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. జాతీయ రహదారి 53పై ఉన్న కొట్లెన్ గ్రామం వద్ద ప్రస్తుతం ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఎదరుకాల్పుల్లో బుల్లెట్ల గాయాల వల్ల ఒక జవాన గాయపడ్డారు. సీఎం బీరేన్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఇంకా ఇంఫాల్‌కు చేరుకోవాల్సిఉన్నది. జిరిబమ్‌కు ఆయన వెళ్లనున్నారు. శనివారం రోజున మిలిటెంట్లు రెండు పోలీసు ఔట్‌పోస్టులు, ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసు, 70 ఇండ్లకు నిప్పు పెట్టారు.