న్యూఢిల్లీ, మే 20: వరుస ప్రమాదాలతో హడలెత్తిస్తున్న మిగ్-21 ఫైటర్ జెట్ల వినియోగాన్ని నిలిపివేశామని భారత వైమానిక దళం శనివారం వెల్లడించింది. 1960 నుంచి ఇప్పటివరకూ 400కుపైగా ప్రమాదాలు జరిగాయి. రష్యా నుంచి 700కుపైగా మిగ్ ఫైటర్జెట్స్ను కొనుగోలు చేయగా, ప్రస్తుతం వాడుతున్నవాటి సంఖ్య 50కి చేరుకుంది. రాబోయే మూడేండ్లలో వీటిని కూడా పక్కకుపెట్టాలని భారత వైమానిక దళం గత ఏడాది నిర్ణయించింది. దశాబ్దాల క్రితం రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్ ఫైటర్ జెట్స్ కాలం చెల్లినవని, విమర్శలు వెల్లువెత్తాయి.