న్యూఢిల్లీ, జూలై 23: తమపై విచారణ జరిపేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వద్ద ఆధారాలు, పత్రాలు లేవని ఢిల్లీ హైకోర్టుకు ఫేస్బుక్ తెలిపింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ అప్డేట్పై వాట్సాప్, ఫేస్బుక్కు సీసీఐకి మధ్య వివాదం నడుస్తున్నది.
న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్ చంద్ర, జస్టిస్ సుబ్రమణియం ధర్మాసనం ముందు ఫేస్బుక్ తరఫు న్యాయవాది రోహత్గి వాదనలు వినిపించారు. తమ సంస్థపై విచారణ జరిపే అధికారం సీసీఐకి లేదని వాట్సాప్ తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే పేర్కొన్నారు. తదుపరి విచారణ 25కు వాయిదా పడింది.