న్యూఢిల్లీ, ఆగస్టు 30: పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వేల కోట్లు రూపాయలు రుణాలు తీసుకొని.. ఎగ్గొట్టి బెల్జియంలో తలదాచుకుంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి అక్కడి కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈనెల 22న ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను బెల్జియం కోర్టు తిరస్కరించింది.
గతంలో తన అరెస్టును బెల్జియం కోర్టులో సవాల్ చేయగా, న్యాయస్థానం తోసిపుచ్చింది. తాజాగా మరోసారి కోర్టును ఆశ్రయించగా, ఎదురుదెబ్బ తగిలిందని సంబంధిత వర్గాలు శనివారం తెలిపాయి.