Mehbooba Mufti: శివాలయంలో మెహబూబా ముఫ్తీ.. సమర్ధించుకున్న పీడీపీ నేత
Mehbooba Mufti: శివ లింగానికి అభిషేకం చేసింది మెహబూబా ముఫ్తీ. పూంచ్‌లో జరిగిన ఆ ఘటన గురించి ఇవాళ ఆమె కామెంట్ చేశారు. యశ్పాల్ శర్మ నిర్మించిన ఆ ఆలయానికి ఆయన కుమారులు అందించిన ఆహ్వానం మేరకు వెళ్లినట్లు చెప్పారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ నేత, పీడీపీ ప్రెసిడెంట్ మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) ఇటీవల ఓ శివాలయాన్ని దర్శించారు. పూంచ్(Poonch) జిల్లాలో ఉన్న ఆ ఆలయంలో ఆమె అభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఆ గుడికి వెళ్లి పూజలు చేసిన విషయాన్ని ఆమె సమర్ధించుకున్నారు. ఈ దేశంలో గాంగా-జమున సంగమం జరుగుతుందని, ఇలాంటి దేశంలో మన జీవిస్తున్నామని, ఇటువంటి అంశాలపై చర్చించడం సరికాదు అని ఆమె అన్నారు.
#WATCH | This temple was built by Yashpal Sharma & his son wanted me to go inside temple. After that, somebody gave me a vessel containing water, so it would have been wrong to deny it so I offered prayers: PDP chief M Mufti on offering prayers at Navagraha temple in Pooch pic.twitter.com/evgHCLAUs3
— ANI (@ANI) March 16, 2023
పూంచ్ జిల్లాలోని మండీ అజోత్లో ఉన్న నవగ్రహ ఆలయంలో ముఫ్తీ పూజలు చేశారు. పూజారి ఆమెకు నీళ్లు ఇవ్వగా.. ఆమె ఆ నీటితో శివాభిషేకం చేసింది. అయితే ఆ వీడియో వైరల్ కావడంతో ముఫ్తీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఆలయాన్ని యశ్పాల్ శర్మ నిర్మించారని, ఆ గుడికి రావాలంటూ యశ్పాల్(Yashpal) కుమారులు తనను ఆహ్వానించారని, గర్భగుడిలోకి వెళ్లిన తర్వాత నీటి చెంబును ఇచ్చారని, నమ్మకం.. ప్రేమతో ఆ నీటి చెంబును తన చేతుల్లో పెట్టారని మెహబూబా అన్నారు.
Is this official gharwapsi of Mehbooba mufti ? If not she shud not be allowed to enter the garbhagriha of any temple https://t.co/DsebAWnBzn
— exsecular (@ExSecular) March 16, 2023
శివలింగంపై నీళ్లు పోయకుండా పూజారి గుండెను గాయం చేయాలన్న ఉద్దేశం తనకు లేదని ముఫ్తీ అన్నారు. పూజారి అడగడంతో.. ఆయన మీద గౌరవంతో అలా చేశానని ముఫ్తీ అన్నారు. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు కలిసి జీవిస్తారని, ముస్లిం దర్గాల్లో హిందువులు చాదర్ కానుకగా ఇస్తారన్నారు. ఇది తనకు చెందిన ఇష్యూ అని, దీంట్లో మరింత డిస్కషన్ అవసరం లేదని మెహబూబా అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

