Heart Attack | న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో 18 ఏండ్ల యువతి గుండెపోటుతో మరణించింది! సోదరి వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలగా, కొద్ది సేపటి తర్వాత ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. గత శుక్రవారం ఇంటివద్ద నిర్వహించిన ‘హల్దీ వేడుక’లో ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతురాలు పేరు రిమ్షాగా బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న రిమ్షా, కొన్ని సెకండ్ల తర్వాత ఛాతి భాగంలో నొప్పి రావటంతో హఠాత్తుగా కుప్పకూలింది. యువతిని కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తేల్చారు.