Meghalaya seat poll | సోహియాంగ్లో యూడీపీ అభ్యర్థి లింగ్డో ఘన విజయం.. బీజేపీ అభ్యర్థికి కేవలం 40 ఓట్లే
Meghalaya seat poll | మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్లోగల సోహియాంగ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (UDP) విజయం సాధించి.. ఆ రాష్ట్రంలో సంకీర్ణ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) కి షాక్ ఇచ్చింది.
షిల్లాంగ్: మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్లోగల సోహియాంగ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అయిన యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (UDP) విజయం సాధించి.. ఆ రాష్ట్రంలో సంకీర్ణ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) కి షాక్ ఇచ్చింది. యూడీపీ అభ్యర్థి షిన్షార్ లింగ్డో తబాహ్ చేతిలో ఎన్పీపీ అభ్యర్థి సామ్లింగ్ మాల్న్జియాంగ్ 3,400 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
షిన్షార్ తబాహ్కు మొత్తం 16,679 (51 శాతం) ఓట్లు పోలవగా, మాల్న్జియాంగ్కు 13,176 (41.22 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ స్థానం నుంచి మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలువగా.. బీజేపీ అభ్యర్థి సెరాప్త్ ఎరిక్ ఖర్బుకీకి కేవలం 40 (0.12 శాతం) ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాగా, గత ఫిబ్రవరిలో మేఘాలయ అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా.. యూడీపీ అభ్యర్థి HDR లింగ్డో మరణంతో సోహియాంగ్ ఎన్నిక వాయిదాపడింది. దాంతో ఇప్పుడు ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

