Worlds Richest Beggar | వరల్డ్స్ రిచెస్ట్ బిచ్చగాడిగా ముంబై వ్యక్తి.. అతని రోజూవారీ సంపాదన, మొత్తం ఆస్తి ఎంతంటే..
Worlds Richest Beggar | రోడ్డు పక్కన, సిగ్నల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్స్, ఆలయాల వద్ద భిక్షాటన (Begging) చేసుకుంటూ చాలా మంది జీవనం నెట్టుకొస్తున్నారు. వారిని చూసిన కొందరు జాలితో కొంత చిల్లర దానం చేస్తుంటారు. అలా బిచ్చమెత్తుకుంటూ జీవిస్తున్న వారిలో కూడా కొందరు కోటీశ్వరులు ఉంటారని మీరు ఎప్పుడైనా ఊహించారా..? లేదు కదా. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం బిచ్చమెత్తుకుంటూ కోట్లు కూడబెట్టాడు.
Worlds Richest Beggar | రోడ్డు పక్కన, సిగ్నల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్స్, ఆలయాల వద్ద భిక్షాటన (Begging) చేసుకుంటూ చాలా మంది జీవనం నెట్టుకొస్తున్నారు. వారిని చూసిన కొందరు జాలితో కొంత చిల్లర దానం చేస్తుంటారు. అలా బిచ్చమెత్తుకుంటూ జీవిస్తున్న వారిలో కూడా కొందరు కోటీశ్వరులు ఉంటారని మీరు ఎప్పుడైనా ఊహించారా..? లేదు కదా. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం బిచ్చమెత్తుకుంటూ కోట్లు కూడబెట్టాడు. ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా (Worlds Richest Beggar) నిలిచి వార్తల్లోకెక్కాడు. ఇంతకీ అతను ఎవరు..? అతని రోజూవారీ సంపాదన ఎంత..? ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
మహారాష్ట్ర (Maharastra) ముంబై (Mumbai)కి చెందిన భరత్ జైన్ (Bharat Jain) బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత భిక్షాటన మొదలు పెట్టాడు. అలా ముంబై వీధుల్లో రోజూ యాచిస్తూ వచ్చిన డబ్బునంతా రూపాయి రూపాయి దాచుకున్నాడు. అలా రోజుకు వేలల్లో సంపాదిస్తూ రూ.కోట్ల ఆస్తులు కూడబెట్టాడు. తన పిల్లల్ని కార్పొరేట్ పాఠశాలల్లో చదవిస్తూ.. ఓ డూప్లెక్స్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అంతేకాదు ముంబైలో పలు చోట్ల ఆస్తులను సైతం కొనుగోలు చేశాడు. దీనికి తోడు రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడులు పెట్టాడు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో ఆదాయన్ని అర్జిస్తూ ఏకంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన బిచ్చగాడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం అతని ఆస్తి విలువు రూ.7.5 కోట్ల వరకు ఉంటుందట.
జైన్ కు ముంబైలో డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ఉంది. దాని విలువ రూ.1.2 కోట్ల వరకు ఉంటుంది. ఇక ఠాణేలో రెండు షాపులు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ.30 నుంచి రూ.40 వేల వరకూ అద్దె రూపంలో ఆదాయం వస్తోంది. దాంతో పాటు రోజూ భిక్షాటన చేస్తూ రోజుకు రూ.2,000కు పైనే అర్జిస్తున్నాడు. అలా నెలకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకూ సంపాదిస్తున్నాడట. మొత్తం అతని నెల ఆదాయం ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీతం కంటే ఎక్కువే మరి. ప్రస్తుతం అతను పరేల్ ప్రాంతంలో ఓ డూప్లెక్స్ ఇంట్లో భార్య, పిల్లలు, సోదరుడు, తండ్రితో కలిసి నివాసముంటున్నాడు.
ఇంత సంపాదించినప్పటికీ ఇంకా అతను ఆ యాచక వృత్తిలోనే కొనసాగుతన్నాడు. కుటుంబ సభ్యులు ఆ పని మానేయమని ఎంత చెప్పినా వినట్లేదట. తనను ఇంతటివాన్ని చేసిన ఈ వృత్తిని వదిలేందుకు అతడికి ఇష్టం లేదని చెబుతున్నాడు.
Also Read..
Earthquake | ఐస్లాండ్ లో ఒక్కరోజే 1600 భూకంపాలు.. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగే అవకాశం
Urinated | ఆదివాసీపై మూత్ర విసర్జన.. బాధితుడి కాళ్లు కడిగిన సీఎం చౌహాన్
Elon Musk | ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్ యాప్.. ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

