న్యూఢిల్లీ : భారత నావికా దళంలో ఫైటర్ పైలట్‌గా శిక్షణ పొందిన తొలి మహిళగా సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా నిలిచారు. దీంతో ఇండియన్ నేవీలో మహిళా ఫైటర్ పైలట్ల శకం ప్రారంభమైంది. నేవీ ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లో, సెకండ్ బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్స్ ఈ నెల 3న ముగిసినట్లు తెలిపింది.
లెఫ్టినెంట్ అతుల్ కుమార్ ధుల్, సబ్ లెఫ్టినెంట్ ఆస్థా పూనియా ప్రతిష్ఠాత్మక ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ను రియర్ అడ్మిరల్ జనక్ బెవ్లీ, ఏసీఎన్ఎస్ (ఎయిర్) నుంచి స్వీకరించినట్లు తెలిపింది. నేవల్ ఏవియేషన్ రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని పేర్కొంది.