Shakti Dubey : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ (Prayagraj) కు చెందిన శక్తి దూబే (Shakti Dubey) సివిల్స్‌లో ప్రథమ ర్యాంకు సాధించడంపట్ల ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేశారు. శక్తిదూబే తల్లి ప్రేమ దూబే (Prema Dubey) మాట్లాడుతూ.. దేవుడి ఆశీస్సుల వల్లే తన కుమార్తె ఇంత గొప్ప విజయం సాధించిందని అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివిందని తెలిపారు.
ప్రస్తుతం శక్తి దూబే ఢిల్లీలో ఉందని, బుధవారం ఇంటికి వస్తదని ప్రేమ దూబే చెప్పారు. ఇక తన కుమార్తె విజయంలో తాను పోషించిన పాత్ర కేవలం అవసరమైన వాటిని అందుబాటులో ఉంచడం ఒక్కటేనని శక్తి దూబే తండ్రి దేవేంద్ర కుమార్ దూబే అన్నారు. భగవంతుడి ఆశీస్సులు, కఠోర శ్రమ వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. ఈ ఫలితాల పట్ల ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తాను పోలీస్ శాఖలో పనిచేస్తుండటంతో ఎక్కువగా బయటే ఉంటానని.. కుమార్తె విజయంలో తన భార్య పాత్రే ఎక్కువగా ఉందని అన్నారు.