ఇప్పుడు మన దేశంలో డిజిట్ యుగం నడుస్తోంది. లిక్విడ్ క్యాష్ గనక లేకపోతే డిజిటల్ పేమెంట్లు చేసేస్తున్నాం. ఈ డిజిటల్ పేమెంట్ ఇప్పుడు భిక్షాటనలో కూడా వచ్చేసింది. సహజంగా మన దగ్గర చిల్లర లేకపోతే భిక్షం వేయం. అలాగే వెళ్లిపోతాం. కానీ బిహార్ దగ్గర ఓ భిక్షగాడు దీనికీ ఓ ఉపాయం కనిపెట్టాడు. రాజు ప్రసాద్ ఆయన పేరు. బిహార్‌లోని బెటయ్య ప్రాంతంలో ఉంటాడు. అయితే ప్రజల దగ్గర చిల్లర లేకపోతే.. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, డిజిటల్‌గా భిక్షాటన ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఇందుకు గాను తన మెడలో క్యూఆర్ కోడ్‌ను ఉంచుకొంటూ మరీ భిక్షాటన చేస్తున్నాడు.
ఎవరైనా చిల్లర లేదంటే… పర్లేదు… డిజిటల్ పేమెంట్ చేయండి అని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. ‘మీ దగ్గర భిక్షం వేయడానికి చిల్లర లేకపోయినా పర్లేదు… ఇబ్బంది పడకండి. మీరు ఫోన్ పే ద్వారానో, గూగుల్‌పేతో సహా… ఇతర ఏ డిజిటల్ రూపంలోనైనా నాకు భిక్షం వేయవచ్చు. నా దగ్గర ఆధార్ వుంది. కానీ పాన్ కార్డు లేదు. దీంతో బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆలస్యమవుతోంది. కానీ… నేను బిచ్చగాడినైనా.. డిజిటల్ పేమెంట్‌లోకి వచ్చేశాను’ అని పేర్కొంటున్నాడు.