న్యూఢిల్లీ, జనవరి 7: భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన మహిళా ఫైటర్ పైలట్, స్కాడ్రన్ లీడర్ అవనీ చతుర్వేది తొలిసారి దేశం వెలుపల గగనతల యుద్ధ క్రీడల్లో (ఏరియల్ వార్ గేమ్స్‌లో) పాల్గొని సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ‘వీర్ గార్డియన్-2023’ పేరుతో ఈ నెల 16 నుంచి 26 వరకు జపాన్‌లోని హ్యకురి, ఇరుమా ఎయిర్ బేస్‌ల పరిధిలో జరిగే ఈ క్రీడలకు ఎంపికైన భారత బృందంలో ఆమెకు చోటు లభించింది. భారత్‌లోని తొలి ముగ్గురు మహిళా పైలట్లలో ఒకరైన అవనీ చతుర్వేది ఈ క్రీడల్లో పాల్గొనేందుకు కొద్ది రోజుల్లో జపాన్‌కు బయల్దేరనున్నారు. ప్రస్తుతం ఆమె సుఖోయ్ (ఎస్‌యూ-30 ఎంకేఐ) యుద్ధ విమాన పైలట్‌గా ఐఏఎఫ్‌కు సేవలందిస్తున్నారు. పటిష్ఠమైన దేశీయ ఆయుధ వ్యవస్థలతో కూడిన ఈ విమానం ఐఏఎఫ్‌లోని అత్యుత్తమ యుద్ధ విమానాల్లో ఒకటి.