ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 16:23:00

బాబ్‌-క‌ట్ సెంగ‌మ‌లం.. ఈ ఏనుగు హెయిర్ స్టైల్ ఎప్పుడైనా చూశారా?

బాబ్‌-క‌ట్ సెంగ‌మ‌లం.. ఈ ఏనుగు హెయిర్ స్టైల్ ఎప్పుడైనా చూశారా?

త‌మిళ‌నాడుకు చెందిన ఈ ఏనుగు హెయిర్‌స్టైల్  చూశారా ? దీనికి ఇంట‌ర్‌నెట్‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.  మ‌న్నార్గుడి ప‌ట్ట‌ణంలోని రాజ‌గోపాల‌స్వామి ఆల‌యంలో ఉన్న ఈ ఏనుగు పేరు "బాబ్-కట్ సెంగమలం".  వెరైటీ హెయిర్‌స్టైల్‌తో  ఈ ఏనుగు దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకుంది. తాజాగా సెంగ‌మ‌లం ఫోటోల‌ను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుధా రామెన్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.    

సెంగమలంను 2003 లో కేరళ నుంచి రాజగోపాలస్వామి ఆలయానికి తీసుకు వ‌చ్చారు. దీని హెయిర్‌స్టైల్ బాధ్య‌త‌లు మహౌట్ ఎస్ రాజగోపాల్ చూసుకుంటారు. ఈ హెయిర్‌క‌ట్‌ను ఇంట‌ర్‌నెట్‌లో చూసిన రాజ‌గోపాల్‌.. సెంగ‌మ‌లంకు కూడా ఇలా చేస్తే బాగుంటుందని డిసైడ్‌ అయ్యారు. అంతే.. ఆలోచన వచ్చిందే తడవుగా ఏనుగుకు జుట్టు పెంచ‌డం మొద‌లుపెట్టారట. దీంతో ఏనుగు లుక్‌ ఇలా మారిపోయింది. 

దీని హెయిర్‌స్టైల్‌ కోసం ప్రత్యేకంగా కేర్‌ తీసుకుంటున్నారు. వేస‌వి కాలంలో సెంగ‌మ‌లం జుట్టును రోజుకు మూడుసార్లు శుభ్ర‌ప‌రుస్తారు. ఇత‌ర సీజ‌న్ల‌లో అయితే క‌నీసం రోజుకు ఒక‌సారి క‌డుగుతారు. అంతేకాదు వేస‌విలో ఏనుగుకు చ‌ల్ల‌గా ఉండేందుకు మ‌హౌట్ రూ. 45,000 విలువైన ప్ర‌త్యేక ష‌వ‌ర్‌ను కూడా ఏర్పాడు చేశార‌ట‌. శ‌రీరంలోని వేడిని తొలిగించ‌డానికి త‌ల‌మీద ఉన్న జుట్టు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందట. ఏదైతేనేం ఈ ఏనుగు మాత్రం ల‌గ్జ‌రీగా బ‌తికేస్తున్న‌ది. అందుకే ఈ ఫోటోలకు వేలకొద్దీ లైక్స్ వస్తున్నాయి. 

  


logo