ఇస్లామాబాద్: పాకిస్థాన్లో పేడ పన్ను దెబ్బకు విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. బయో గ్యాస్ కార్యక్రమం కోసం ‘సుత్రా పంజాబ్’ పేరుతో పంజాబ్ సీఎం మర్యం నవాజ్ ప్రతి బర్రెకు దాని యజమాని రోజుకు రూ.30 పన్నుగా చెల్లించాలని ఆదేశించారు. పాకిస్థానీలు దీన్ని పేడ పన్నుగా పిలుస్తున్నారు. 168 పశువుల కాలనీల్లోని 50 లక్షల జీవాలపై ఈ పన్ను పడనుంది.
పన్ను ద్వారా రూ.450 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో కొందరు యజమానులు బర్రెలకు జీరో-వేస్ట్ ఆహారాన్ని అందిస్తున్నారు. మరికొందరు తమ పశువులకు డైపర్లు తొడగడం ప్రారంభించారు. ‘పశువుల పేడపై పన్ను వేసినప్పుడు.. మనుషుల మలం పైనా పన్ను వేయకుండా ఉండరు’ అనే మాటలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.