లక్నో: మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో హింస చెలరేగింది. కౌన్సిలర్లు ఎడాపెడా కొట్టుకున్నారు. (Meerut councillors thrash each other) ఒకరినొకరు ఈడ్చుకుని రోడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ కూడా తన్నుకున్నారు. కౌన్సిలర్లను శాంతింపజేసేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్సీపై కూడా దాడి చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. శనివారం మీరట్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరిగింది. బీజేపీ కౌన్సిలర్ రేఖా సింగ్ ఇంటి పన్ను గురించి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సమావేశంలో ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించారు. కొందరిని రోడ్డు వద్దకు ఈడ్చుకెళ్లి కొట్టారు. శాంతింపజేసేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్సీ ధర్మేంద్ర భరద్వాజ్‌పై కూడా కౌన్సిలర్లు దాడి చేశారు.
కాగా, మీరట్ బీజేపీ ఎమ్మెల్యే సోమేంద్ర తోమర్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. కౌన్సిలర్లు కొట్టుకోవడాన్ని రికార్డ్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు మీరట్ మేయర్ హరికాంత్ అహ్లువాలియా తెలిపారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ మున్సిపల్ కౌన్సిల్ బోర్డు మీటింగ్‌లో బీజేపీ కౌన్సిలర్లు కొట్టుకున్న ఒక రోజు తర్వాత మీరట్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో కూడా ఇలాంటి సంఘటన జరుగడం చర్చకు దారితీసింది.
मेरठ नगर निगम की बैठक में सत्ता और विपक्ष के पार्षद भिड़े। जमकर मारपीट, कपड़े फटे। बीच–बचाव में BJP के MLC धर्मेंद्र भारद्वाज नीचे गिरे। IAS ऑफिसर, मेयर सबके सामने सदन की मर्यादा तार–तार हुई
पिटने वाला बसपा पार्षद आशीष चौधरी है और पीटने वाले BJP के MLC धर्मेंद्र भारद्वाज हैं।… pic.twitter.com/AYClv9Cbte
— Lavely Bakshi (@lavelybakshi) December 30, 2023