న్యూఢిల్లీ: నీట్-యూజీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో సీబీఐ రాంచీలో సురభి కుమారి అనే విద్యార్థినిని అరెస్ట్ చేసింది. ఆమె రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఓ ఇంజినీర్ నీట్-యూజీ ప్రశ్నపత్రాలను దొంగిలించగా, అతడి సాల్వర్ మాడ్యూల్ ముఠాలో ఈ విద్యార్థిని ఆ ప్రశ్నాపత్రానికి సమాధానాలు రాసి ఇచ్చినట్టు సీబీఐ గుర్తించింది. రెండు రోజులపాటు ప్రశ్నించిన అనంతరం ఆమెను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. హజారీబాగ్‌లో మే 5న ఉదయం సాల్వర్ మాడ్యూల్లో ఉన్న ఐదో వ్యక్తి సురభి కుమారి అని చెప్పారు. ఈ కేసుల్లో ఇప్ప టి వరకు 16 మంది అరెస్టయ్యారు.
ఆగస్టు 8న నీట్ పీజీ అడ్మిట్ కార్డుల విడుదల
న్యూఢిల్లీ: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ) కోసం అడ్మిట్ కార్డులు ఆగస్టు 8న విడుదలవుతాయి. ఈ పరీక్ష కోసం రిజిస్టర్ చేయించుకున్నవారు అధికారిక వెబ్సైట్లో తమ లాగిన్ క్రెడెన్షియల్స్‌ను ఎంటర్ చేసి, అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
స్థానిక కోటా ఆమోదించకుంటే తిరుగుబాటే
బెంగళూరు, జూలై 19: ప్రైవేట్ ఉద్యోగాల నియామకంలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనుకూల, ప్రతికూల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, కంపెనీ యజమానుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఇప్పటికే ఈ బిల్లును ఉపస ంహరించుకుంటున్నట్టు సిద్ధరామయ్య ప్రభు త్వం ప్రకటించింది. కాగా రిజర్వేషన్ బిల్లును తీవ్రంగా విమర్శించిన ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ మాజీ సీఈవో మోహన్ దాస్‌పై కన్నడ అనుకూల సంస్థ కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్వీ) అధ్యక్షుడు నారాయణ గౌడ మండిపడ్డారు. ఈ రిజర్వేషన్ బిల్లును ‘ఫాసిస్ట్’గా పేర్కొనడాన్ని నారాయణ తప్పు బట్టారు. ఈ బిల్లును కనుక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించకపోతే సామూహిక తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరి ంచారు. ఈ నిర్ణయంపై సీఎం సిద్ధరామయ్య వెనుకడుగు వేయరాదన్నారు.