ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదం(Jhansi hospital fire)లో పది మంది శిశువులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై ఆ రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకున్నది. ఝాన్సీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర సింగ్ సెంగార్‌ను తొలగించారు. ఆ కాలేజీకి చెందిన మరో ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. నవంబర్ 15వ తేదీ జరిగిన ప్రమాదానికి చెందిన నివేదికను నలుగురు సభ్యుల కమిటీ ఇచ్చింది. డిప్యూటీ సీఎం బ్రజేశ్ ఠాక్ ఈ చర్యలు తీసుకున్నారు.
ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ బాధ్యతలు ఆయనే చూసుకుంటున్నారు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మహారాణి లక్ష్మీ భాయ్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను తొలగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వేటుకు గురైన ముగ్గురు సిబ్బందిలో.. ఓ చీఫ్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజినీర్, వార్డు నర్సు ఉన్నారు. ఎలక్ట్రకిల్ ఇంజినీర్ సంజీత్ కుమార్, ఎన్ఐసీయూ వార్డు ఇంచార్జీ నర్సు సంధ్యా రాణి, చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ సునితా రాథోడ్‌పై వేటు వేశారు.