లక్నో : యూపీలో యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బృందావన్-మధురలో పది కిలోమీటర్ల పరిదిలో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. గణేష్ చతుర్ధి వేడుకలకు ముందు యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
శ్రీకృష్ణుడి జన్మస్థలం మధుర, బృందావన ప్రాంతాలను యాత్రా స్ధలంగా ప్రకటించడంతో ప్రభుత్వం ఈ ప్రాంతంలో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించింది. నిషేధం అమలును సంబంధిత అధికారులు పర్యవేక్షిచడంతో పాటు ఇప్పటివరకూ ఈ వృత్తుల్లో ఉన్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సూచిస్తారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ వెల్లడించారు.