ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మీడియా డిబేట్లకు పార్టీ నేతలెవ్వరూ వెళ్లొద్దని హుకూం జారీ చేశారు. యూపీ మీడియా ఓ కులం పక్షాన ఉంటూ, కులం ఎజెండాను అమలు చేస్తోందంటూ తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. మీడియా వ్యవహార శైలి తమ పార్టీ గెలుపును దెబ్బతీసిందంటూ విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో మీడియా బీఎస్పీ పట్ల వ్యవహరించిన తీరు ఘోరమని, అది ఎవ్వరూ గ్రహించడం లేదని మాయావతి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మీడియా వ్యవహార శైలి వల్లే బీఎస్పీ ఘోర పరాభవం పాలైందని మాయావతి తీవ్రంగా ఆరోపించారు.
యూపీలో అధికార బీజేపీ, సమాజ్వాదీ మధ్యే తీవ్రమైన పోటీ నెలకొంది. బీఎస్పీ కేవలం ఒకే ఒక్క చోట గెలిచింది. ఈ ఓటమితో కార్యకర్తలెవ్వరూ కుంగిపోవద్దని మాయావతి పిలుపునిచ్చారు. ఈ ఫలితాల నుంచి కచ్చితంగా పాఠాలు నేర్చుకుంటామని, వచ్చే ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా గెలిచితీరుతామని మాయావతి ధీమా వ్యక్తం చేశారు.