న్యూఢిల్లీ, అక్టోబర్ 17: పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన పదేండ్లలో పన్ను వసూళ్లు 182 శాతం పెరిగి రూ.19.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన టైమ్ సీరిస్ డాటాలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2014-15 నుంచి 2023-24 వరకు వసూలైనదాంట్లో కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు రెండింతలు పెరిగి రూ.9.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అలాగే వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు నాలుగు రెట్లు పెరిగి రూ.10.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2014-15లో పన్ను వసూళ్లు రూ.6.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. అలాగే ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్య కూడా 4.04 కోట్ల నుంచి 8.61 కోట్లకు చేరుకున్నారు.