న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ మంటలు, దట్టమైన పొగలు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపించాయి. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నోయిడా సరిహద్దు సమీపంలోని ఆగ్నేయ ఢిల్లీలో పార్క్ వద్ద ఈ మంటలు వ్యాపించినట్లు పలువురు ట్విట్టర్ యూజర్లు తెలిపారు. ఈ మంటలు, పొగలు నోయిడా నుంచి కూడా కనిపించినట్లు పేర్కొన్నారు. ఓఖ్లా సరిహద్దు సమీపంలోని యమునా తీర ప్రాంతంలో భారీగా మంటలు, పొగలు వ్యాపించినట్లు న్యాయవాది సుశాంత్ చతుర్వేది ట్వీట్ చేశారు. ఢిల్లీ పొరుగున ఉన్న నోయిడాలోని ఎత్తైన భవనాల నుంచి కూడా ఇవి కనిపిస్తున్నాయని అందులో పేర్కొన్నారు.
కాగా, యమునా నది తీర ప్రాంతంలో ఎండు గడ్డి తగులబెట్టడం వల్ల ఈ భారీ మంటలు, పొగలు వస్తున్నట్లు మరో ట్విట్టర్ యూజర్ ఆనంద్ తెలిపారు. ఎండు గడ్డి కాల్చడంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ పోలీసులకు దీనిని ట్యాగ్ చేశారు.
Massive fire on Banks of yamuna in Delhi which is visible from Noida. Seems like stuble burning. Strict action requested @ArvindKejriwal @AAPDelhi @DelhiPolice #pollution #AQI #delhi #Noida pic.twitter.com/Rq2TKptxbO
— amritam anand (@AmritamAnand) January 18, 2023