చెన్నై : తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కులశేఖరం రబ్బర్ మ్యాన్యుఫ్యాక్చరర్ హాల్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడటంతో కోట్ల రూపాయల విలువైన రబ్బర్ షీట్లు అగ్నికి ఆహుతయ్యాయి.
మంటలను ఆర్పేందుకు మూడు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్ధలానికి చేరుకున్నాయి. రెండు గంటల పాటు మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా పొగ వ్యాపించింది. ఇదే కాంప్లెక్స్‌లో రబ్బర్ తయారీ ప్లాంట్ కూడా ఉంది.
కాంప్లెక్స్‌లోని షెడ్డు నుంచి మంటలు రావడంతో స్ధానికులు ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించారు. దీంతో కులశేఖరం ఫైర్ స్టేషన్ నుంచి అగ్నిమాపక యంత్రాలను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సిబ్బంది శ్రమించారు.
Read More
Watch: మహిళా ప్రయాణికురాలి బ్యాగుల్లో 22 పాములు, ఒక ఊసరవెల్లి.. వీడియో వైరల్