లక్నో: అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన మహా యజ్ఞశాలలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరయూ నది తీరంలోని జమ్తారా ఘాట్ వద్ద నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహా యజ్ఞంలో ప్రమాద ఘటన చోటుచేసుకున్నది.
యజ్ఞశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక ఎకరం విస్తీర్ణంలో వెదురు, గడ్డితో నిర్మించిన మండపం క్షణాల్లో కాలి బూడిదైంది. కాగా, ప్రమాద సమయంలో ఘటనా స్థలిలో యూపీ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.