పవన్ మహావీర్ హీరోగా నటిస్తున్న ప్రేమకథాచిత్రం ‘అమ్మా.. నాకు ఆ అబ్బాయి కావాలి’. వర్షిక, సుహానా హీరోయిన్లు. శివాల ప్రభాకర్ దర్శకుడు. శైలజారెడ్డి నిర్మాత. ఆగస్ట్ 7న విడుదల కానున్నది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య, సి.రాంప్రసాద్, శివనాగు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. నిర్మాణంలో సహకరించిన అందరికీ నిర్మాత శైలజారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కోసం టీమంతా మనసుపెట్టి పనిచేశారని హీరో మహావీర్ చెప్పారు. దర్శకునిగా అవకాశం ఇచ్చిన నిర్మాతకు డైరెక్టర్ శివాల ప్రభాకర్ కృతజ్ఞతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: మహేందర్.ఎం, సంగీతం: సాయికార్తీక్.