బెంగళూర్ : కర్నాటక రాజధాని బెంగళూర్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. వీరభద్రనగర్లోని ఓ పార్కింగ్ స్ధలంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలు ప్రైవేట్ బస్లు దగ్ధమయ్యాయి.
ఘటనా స్ధలానికి అగ్నిమాపక యంత్రాలు తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతమంతా మంటలు ఎగిసిపడటంతో దట్టమైన పొగ వ్యాపించింది. కాగా ప్రమాద ఘటనపై ప్రాధమిక విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగుచూస్తాయని అధికారులు చెబుతున్నారు.
Read More :