సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 00:46:33

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

-17 మంది జవాన్లు మృతి.. 15 మందికి గాయాలు..

-ఇద్దరి పరిస్థితి విషమం

కొత్తగూడెం క్రైం/ చర్ల రూరల్‌/ రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అదృశ్యమైన 17 మంది జవాన్ల మృతదేహాలను కనుగొన్నట్లు రాష్ట్ర డీజీపీ దుర్గేశ్‌ మాధవ్‌ అవస్థి ఆదివారం తెలిపారు. చింతగుఫా-ఎల్మాంగుడ అడవుల్లో నక్సల్స్‌ ఉన్నారన్న సమాచారం మేరకు జిల్లా రిజర్వు గార్డు (డీఆర్జీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌), సీఆర్పీఎఫ్‌-కోబ్రా యూనిట్లకు చెంది న సుమారు 200 మంది జవాన్లు శనివారం తెల్లవారుజామున గాలింపు చేపట్టి రాత్రి వెనుదిరిగాయి. మిన్పా గ్రామ శివారు అడవుల్లో కొరాజ్‌గూడ కొండల వద్ద సుమారు 250 మంది సాయుధ మావోయిస్టులు మెరుపుదాడికి దిగారు. దీంతో ఇరుపక్షాల మధ్య రెండున్నర గంటల పాటు కాల్పులు సాగాయి. కాల్పుల విరమణ తర్వాత భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని చేపట్టిన గాలింపులో 17 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో 12 మంది డీఆర్జీ, ఐదుగురు ఎస్టీఎఫ్‌ పోలీసులున్నారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం హెలికాప్టర్‌ ద్వారా రాయ్‌పూర్‌కు తరలించి ప్రైవేట్‌ దవాఖానలో చేర్చారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. 12 ఏకే 47 రైఫిళ్లపాటు 15 ఆటోమేటిక్‌ ఆయుధాలు, ఒక యూబీజీఎల్‌ ఎన్‌కౌంటర్‌ స్థలంలో నక్సల్స్‌ ఎత్తుకెళ్లారని సుందర్‌ రాజ్‌ చెప్పారు. బస్తర్‌ వాసులతో, లొంగిపోయిన నక్సల్స్‌తో ఏర్పాటైన డీఆర్జీ యూనిట్‌లో జవాన్లు మరణించటం ఇదే తొలిసారి. 

మృతిచెందిన జవాన్లు వీరే..

బుర్కపాల్‌ బృందంలోని డీఆర్జీ జవాన్లు హేమంత్‌ దాస్‌, గంధం రమేష్‌, లిబరు రమ్‌ భగోల్‌, సోయం రమేష్‌, ఊయిక కమలేశ్‌, డీఆర్జీ చింతగుఫాకు చెందిన జవాన్లు పోడి యం మృత్త, ఉయిక ధుర్వా, వంజం నగేష్‌, డీఆర్జీ కుంట బృందంలోని మడకం మాసా, పోడియం లక్మా, మడకం హిద్మా, నితేంద్ర బంజమి. ఇంకా ఎస్టీఎఫ్‌ బృందానికి చెందిన జవాన్లు గీతరామ్‌ రాఠియా, నారద్‌ నిషద్‌, హేమంత్‌ పోయా, అమర్జిత్‌ ఖల్ఖో, మడకం బుచ్చ.


logo