లక్నో: కోచింగ్ సెంటర్ వద్ద ఒక యువతిని కొందరు ఆకతాయిలు వేధించారు. (Masked Miscreants Harass Girl ) విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె తమను అవమానించిందని ఆరోపించారు. ఆ యువతిలో బలవంతంగా క్షమాపణలు చెప్పించుకున్నారు. అనంతరం ఆ యువతి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారు నడవలేని స్థితిలో ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు గాంధీ కాలనీలోని ఒక కోచింగ్ సెంటర్ వద్దకు బైక్పై చేరుకున్నారు. బయట ఉన్న ఒక యువతిని వారు వేధించారు. ఆ విద్యార్థిని తమను అవమానించిందని ఆ దుండగులు ఆరోపించారు. తమకు క్షమాపణ చెప్పాలని ఆమెను డిమాండ్ చేశారు.
కాగా, తాను ఏమీ అనలేదని ఆ యువతి వేడుకున్నప్పటికీ వారు వదిలిపెట్టలేదు. బలవంతంగా ఆమెతో క్షమాపణలు చెప్పించుకున్నారు. ఆ ఆకతాయిలు అక్కడి నుంచి వెళ్లిన వెంటనే ఆ యువతి తన తండ్రికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. దీంతో ఆమె తండ్రి, సోదరుడు బైక్పై అక్కడకు చేరుకున్నారు. యువతిని వేధించిన వారి కోసం వెతికారు. జంక్షన్ వద్ద వారు ఉండటం చూసి పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే బైక్ను వీడిన ఆ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు ఆ యువతి తన తండ్రితో కలిసి ముగ్గురు వ్యక్తుల వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. దుండగులు వదిలేసిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ ఆధారంగా ఇద్దరు నిందితులైన శోభిత్ శర్మ, ఉజ్వల్ కుమార్ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం వెతుకుతున్నారు. అయితే అరెస్టైన నిందితులు ఆ తర్వాత నడవలేని స్థితిలో కనిపించారు. పోలీసులు వారిని చితక్కొట్టిన తర్వాత తమ భుజాలపై మోసుకెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP के मुज़फ्फरनगर की पॉश कही जाने वाली गांधी कॉलोनी में दिन दहाड़े कोचिंग सेंटर के बाहर लड़कियों से छेड़खानी करने वाले नकाबपोश शोहदे उज्जवल और शोभित शर्मा को 3 घंटे के अंदर पुलिस ने अरेस्ट कर इनका मुकम्मल ट्रीटमेंट किया है। अभी इनका एक दोस्त फरार है.. जिसके बारे में पुलिस का… pic.twitter.com/FkybywiS48
— TRUE STORY (@TrueStoryUP) August 2, 2024