న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్‌లో మరో పెట్రోల్ పంపు దాడి(Petrol Pump Attack) ఘటన జరిగింది. ఓ సీఎన్జీ పంపులో.. అక్కడి వర్కర్‌పై కొందరు దాడి చేశారు. ఆ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలకు చిక్కాయి. బులంద్‌షెహర్‌లోని ఔరంగాబాద్ పట్టణంలో ఈ ఘటన జరిఇంది. పేమెంట్ విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే కారులో ఉన్న వ్యక్తులు .. సీఎన్జీ ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ అంశంలో ఘర్షణకు దిగారు. అయితే మాస్క్ ధరించిన వచ్చిన కొందరు తమ చేతుల్లో ఉన్న కర్రలతో వర్కర్‌పై అటాక్ చేశారు. విచక్షణరహితంగా పంప్ ఉద్యోగిపై దాడి చేసి కారులో పరారీ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
#FLASH: Masked Thugs Brutally Attack CNG Pump Attendant Over Payment in UP’s Bulandshahr
Masked assailants mercilessly thrashed a CNG pump worker in Aurangabad town, Bulandshahr (Uttar Pradesh), after he demanded payment.
The attackers, who arrived in a car, fled the scene… pic.twitter.com/CVfcQYk8TP
— The New Indian (@TheNewIndian_in) June 18, 2025