Maruti Suzuki | 2025 నాటికి 2.5 మిలియన్ల మందికి డ్రైవింగ్‌లో శిక్షణ : మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ దేశంలో 500 సుజుకీ డ్రైవింగ్ స్కూల్స్ మైలురాయిని చేరినట్లు బుధవారం కంపెనీ ప్రకటించింది. డీలర్ల భాగస్వామ్యంతో మారుతీ సుజుకీ ఈ డ్రైవింగ్ స్కూల్స్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 242 నగరాల్లో ఈ డ్రైవింగ్ స్కూల్స్ నడుస్తున్నాయి. 2005లో ప్రారంభమైన మారుతీ సుజుకీ డ్రైవింగ్ స్కూల్స్ ఇప్పటి వరకు 17లక్షల మంది వినియోగదారులకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడారు.
భారతీయ రహదారులను సురక్షితం చేయడానికి డ్రైవింగ్‌లో శిక్షణ, రహదారి ప్రవర్తనను అందించడం లక్ష్యంతో మారుతీ సుజుకీ డ్రైవింగ్ స్కూల్స్ ప్రధాన లక్ష్యంతో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఎంఎస్డీఎస్ నెట్‌వర్క్‌లో దాదాపు 1500 మంది సర్టిఫైడ్ అండ్ క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్ ట్రైనర్లు ఉన్నారని, వారంతా ఉత్తమమైన డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నారన్నారు. 2025 నాటికి ఎంఎస్డీఎస్ నెట్‌వర్క్‌ను విస్తరించి, 2.5 మిలియన్ల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

