Married Woman Dupes Man | వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుని మోసగించిన మహిళ.. డబ్బు కోసం రెండో భర్త ద్వారా బెదిరింపు
Married Woman Dupes Man | వివాహిత మహిళ ఒక వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. రెండో భర్త ద్వారా బెదిరించి డబ్బులు దోచుకుంది. (Married Woman Dupes Man) ఈ మోసం గురించి తెలియడంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లక్నో: వివాహిత మహిళ ఒక వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. రెండో భర్త ద్వారా బెదిరించి డబ్బులు దోచుకుంది. (Married Woman Dupes Man) ఈ మోసం గురించి తెలియడంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. సేనాని విహార్ ప్రాంతానికి చెందిన పర్మానంద్ సింగ్, మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో తన బయో డేటాను అప్లోడ్ చేశాడు. దీంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్లు పేర్కొన్న 30 ఏళ్ల మహిళ అతడ్ని సంప్రదించింది. ఈ నేపథ్యంలో 2022 నవంబర్లో వారిద్దరికి పెళ్లి జరిగింది.
కాగా, పెళ్లైన ఏడాది తర్వాత గత నవంబర్లో అనుపమ్ సోనీ అనే వ్యక్తి పర్మానంద్ సింగ్కు ఫోన్ చేశాడు. అతడు వివాహం చేసుకున్న మహిళ తన భార్య అని చెప్పాడు. ఆమెతో పెళ్లిని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించి డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ విషయంపై భార్యను పర్మానంద్ సింగ్ నిలదీశాడు. దీంతో అనుపమ్ సోనీకి ముందు అశుతోష్ పాఠక్తో కూడా ఆమెకు పెళ్లి జరిగినట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు.
మరోవైపు ఉద్యోగం గురించి కూడా భార్య అబద్ధం చెప్పినట్లు పర్మానంద్ సింగ్ తెలుసుకున్నాడు. ఆమె తనను మోసం చేసిందని, రెండో భర్త, ఇతరుల ద్వారా రూ.2.67 లక్షల విలువైన డబ్బు, నగలను దోచుకున్నదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఆస్తి, స్టేటస్ గురించి తెలిసిన ఆ మహిళ కుటుంబ సభ్యులు వాటిని దక్కించుకునేందుకు పెళ్లి పేరుతో తనను మోసం చేశారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

