బెంగళూరు: ట్యూషన్ కోసం వచ్చే మైనర్ బాలికతో టీచర్ సన్నిహితం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెతో కలిసి పారిపోయాడు. (Teacher Elops With Girl) అయితే పెళ్లై, పిల్లున్న ఆ టీచర్‌ను నెలన్నర తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి చెరలో ఉన్న బాలికను రక్షించి ఆమె కుటుంబానికి అప్పగించారు. కర్ణాటకలోని మాండ్యాలో ఈ సంఘటన జరిగింది. ఒక బాలిక ప్రతి రోజూ ట్యూషన్‌కు వెళ్తున్నది. అయితే పెళ్లై, రెండేళ్ల చిన్నారి ఉన్న 25 ఏళ్ల ట్యూషన్ టీచర్ ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో నవంబర్ 23న ఆ బాలికతో కలిసి అతడు పారిపోయాడు.
కాగా, బాలిక అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు జేపీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం వెతికారు. జనవరి 5న మాండ్యా జిల్లాలోని మలవల్లి తాలూకాలో ఆ బాలికను గుర్తించి రక్షించారు. ట్యూషన్ టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కిడ్నాప్‌తోపాటు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.