న్యూఢిల్లీ, మే 17: కొత్త నేర న్యాయ చట్టాల్లో మ్యారిటల్ రేప్‌కు (భార్యకు ఇష్టం లేని శృంగారం) మినహాయింపు ఇవ్వడంపై దాఖలైన పిటిషన్లపై తమ వైఖరేంటో తెలపాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రాన్ని కోరింది. భారత న్యాయ సంహితలోని సెక్షన్ 63(రేప్)లో మినహాయింపు 2 ప్రకారం.. ‘18 ఏండ్లు దాటిన భార్యతో భర్త జరిపే లైంగిక సంపర్కం, లైంగిక చర్యలు రేప్‌గా పరిగణించబడవు’.